Covid 19: కరోనా ఉధతిపై కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ సర్కార్

Covid 19:కరోనా పేషెంట్ల తరలింపునకు ప్రత్యేక వాహనాలు..33జిల్లాల కేంద్రాల్లో వైద్యం అందించేందుకు ఏర్పాట్లు

Update: 2021-04-03 15:53 GMT
ఈటల రాజేందర్ ఫైల్ ఫోటో 

Covid 19: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అధికారులతో సుధీర్గంగా చర్చించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కేసులు పెరుగుతున్న నేపధ్యంలో క్వారంటైన్ సెంటర్లు తిరిగి ప్రారంభించాలని ఆదేశించారు. రాష్ట్రంలో 33జిల్లాల కేంద్రాల్లో బాధితులకు వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే 24 గంటలూ వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. మరోవైపు.. కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక యాప్‌ను రూపొందించింది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ కోసం ప్రత్యేక యాప్ రూపొందించారు. ఎస్ఎమ్ఎస్ ద్వారా కాంటాక్ట్ పర్సన్‌కు సమాచారం అందించే దిశగా యాప్ రూపొందించారు.


Tags:    

Similar News