సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్ర.. టీఎస్‌ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ నియామకం

Update: 2021-08-25 11:30 GMT
Telangana Government Appointed The Stephen Ravindra as Cyberabad CP And Sajjanar as TSRTC MD

స్టీఫెన్ రవీంద్ర - సజ్జనార్ (ఫైల్ ఫోటో)

  • whatsapp icon

Telangana: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ బదిలీ అయ్యారు. ఆయనను ఆర్టీసి ఎండీగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సజ్జనార్‌ స్థానంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్రని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సజ్జనార్ 1996 బ్యాచ్ కు చెంది ఐపీఎస్ ఆఫీసర్. సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ సంచలన కేసులు చేధించారు. ఇటీవలే ఆయన అడిషనల్ డీజీ ర్యాంకు ప్రమోషన్ పొందారు.

వరంగల్ యాసిడ్ దాడి కేసులో ఎన్ కౌంటర్, శంషాబాద్ దిశ ఎన్ కౌంటర్‌ ఘటనలు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచేలా చేశాయి. మల్టీ లెవెల్ స్కాములను ఛేదించడంలో సజ్జనార్‌కు మంచి పేరుంది. కరోనా సమయంలో ప్లాస్మా డొనేషన్‌లో విశేష సేవలు అందించారు.

Tags:    

Similar News