Errabelli Dayakar Rao: కేసీఆర్ సీఎం అయిన తర్వాతే తెలంగాణ అభివృద్ధి చెందింది
Errabelli Dayakar Rao: నాకు మరోసారి అవకాశం ఇచ్చి గెలిపించండి
Errabelli Dayakar Rao: పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని జనగామ జిల్లా కొడకండ్ల మండలం రేగుల, ఏడునూతల, నర్సింగాపురం, రంగాపురం గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఆయనకు డప్పుచప్పుళ్లు.. బతుకమ్మలతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారాయన.. 24 గంటల కరెంటు, అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశ పెట్టి... అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలను నమ్మొద్దని ఆయన కోరారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో ఎంతో అభివృద్ధి చేసిన తనను మరోసారి గెలిపించాలని కోరారు.