Telangana: గౌడన్నలకు ‘కాటమయ్య రక్ష’.. నేడు లష్కర్‌గూడలో సేఫ్టీ కిట్లు పంపిణీ చేయనున్న సీఎం రేవంత్

Katamaya Raksha Safety Kits: తెలంగాణలో గీత కార్మికుల రక్షణ కోసం కాటమయ్య రక్ష పేరుతో ప్రభుత్వం సేఫ్టీ కిట్లను పంపిణీ చేయనుంది. బీసీ కార్పొరేషన్ ద్వారా అందించే ఈ కిట్లను సీఎం రేవంత్‌రెడ్డి నేడు గౌడన్నలకు పంపిణీ చేయనున్నారు.

Update: 2024-07-14 05:20 GMT

Katamaya Raksha Safety Kits: తెలంగాణలో గీత కార్మికుల రక్షణ కోసం కాటమయ్య రక్ష పేరుతో ప్రభుత్వం సేఫ్టీ కిట్లను పంపిణీ చేయనుంది. బీసీ కార్పొరేషన్ ద్వారా అందించే ఈ కిట్లను సీఎం రేవంత్‌రెడ్డి నేడు గౌడన్నలకు పంపిణీ చేయనున్నారు.రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడ గ్రామంలో కిట్లు అందించి ఆ తర్వాత గౌడన్నలతో కలిసి సహంపక్తి భోజనం చేస్తారు.

కాగా, ఒక్కో కిట్‌లో తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్, స్లింగ్ బ్యాగ్, లెగ్ లూప్ ఉంటాయి. గీత కార్మికులు తాటిచెట్లు కల్లు గీసే క్రమంలో చాలాసార్లు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలను నివారించేందుకు ఆధునికతను జోడించి హైదరాబాద్ ఐఐటీతో కలిసి ఈ సేఫ్టీ కిట్లను ఓ ప్రైవేట్ సంస్థ తయారు చేసింది.

ప్రస్తుతం గీత కార్మికులు ఉపయోగిస్తున్న సాంప్రదాయ కిట్ల తరహాలోనే యూజర్ ఫ్రెండ్లీగా ఈ కిట్లు ఉంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Tags:    

Similar News