Telangana Govt: విద్యార్థులకు గుడ్ న్యూస్..సర్కార్ సంచలన నిర్ణయం..వాళ్లందరికీ ల్యాప్‎టాప్స్

Telangana Govt: విద్యార్థులకు క్వాలిటీ స్టడీ అందించేందుకు క్వాడ్ జెన్ అనే ప్రముఖ సంస్థతో కలిపి ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా విద్యార్థులకు 20వేల విలువైన ల్యాప్ టాప్స్ అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Update: 2024-07-04 00:44 GMT

Telangana Govt: విద్యార్థులకు గుడ్ న్యూస్..సర్కార్ సంచలన నిర్ణయం..వాళ్లందరికీ ల్యాప్‎టాప్స్

Telangana Govt:తెలంగాణలోని విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ అదిరిపోయే వార్తను అందించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మూతబడిన పాఠశాలలను మళ్లీ తెరిపించడంతోపాటు, సమీక్రుత గురుకులాలు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విద్యార్థులకు క్వాలిటీ స్టడీ అందించేందుకు క్వాడ్ జెన్ అనే ప్రముఖ సంస్థతో కలిపి ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా విద్యార్థులకు 20వేల విలువైన ల్యాప్ టాప్స్ అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్కుతో ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ..ఇతర రంగాలపై కూడా ఫోకస్ పెడుతున్నారు. తాజాగా విద్యారంగంపై కూడా తనదైన ముద్ర పడేలా కీలకనిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే మహిళలు, రైతులు, నిరుద్యోగులపై ఫోకస్ పెట్టారు. పలు ఆకర్షణీయమైన పథకాలను అమలు చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని పథఖాలు అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుండగా..నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ ను ప్రకటించేందుకు కసరత్తు కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అదిరిపోయే వార్తను చెప్పారు సీఎం రేవంత్. ఇప్పటికే మూతపడిన పాఠశాలలను తెరిపిస్తామని ప్రతి పల్లెకు, తండాకు ఓ బడి ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని సీఎం మాటిచ్చారు.

దీనిలో భాగంగా ఇప్పటికే రన్ అవుతున్న పాఠశాలలో మెరుగైన విద్యను అందించేందుకు రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. క్వాడ్ జెన్ అనే ప్రముఖ సంస్థతో కలిసి తెలంగాణలోని ప్రతి పాఠశాలకు ఇంటరాక్టివ్ వైట్ బోర్డు, విద్యార్థులకు 20వేల లోపు ల్యాప్ టాప్స్ అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రాష్ట్రంలో 5 జీ మొబైల్ నెట్ వర్కును మరింత విస్త్రుతం చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు.

Tags:    

Similar News