TG DSC Results: నేడు తెలంగాణ డీఎస్సీ ఫలితాలు...
TG DSC Results 2024:నేడు తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు విద్యాశాఖ జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ ఆన్ లైన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
TG DSC Results: తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్షలకు హాజరై ఫలితాలకోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు నేటితో ఉత్కంఠకు తెరపడనుంది. నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి డీఎస్సీ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11,062 ప్రభుత్వ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసేందుకు విద్యాశాఖ జులై 18 నుంచి ఆగస్టు 15 వరకు డీఎస్సీ ఆన్ లైన్ పరీక్షలు నిర్వహించింది. ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేస్తామని విద్యాశాఖ ప్రకటించింది. డీఎస్సీకి 2,79,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలకు 2,45,263 మంది హాజరయ్యారు.
పరీక్షలు పూర్తయిన మూడు వారాలు దాడటంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో సోమవారం ఉదయం ఫలితాలను రిలీజ్ చేసేందుకు ముహూర్తం నిర్హయించారు. ప్రాథమిక కీని ఆగస్టు 31న విడుదల చేశారు. ఆగస్టు 20 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. దాదాపు 28వేల అభ్యంతరాలు రాగా వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకున్న తర్వాత సెప్టెంబర్ 6వ తేదీన ఫైనల్ కీ రిలీజ్ చేశారు.
మరోవైపు ఫైనల్ కీలోనూ తప్పులు ఉన్నాయని కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. వీటిపై ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత వారంలోకా ఫలితాలు వెలువడతాయని భావించినా ఆలస్యం అయ్యింది. ఇప్పటికే మూడు వారాలు దాటిపోయిందని ఆందోళణ వ్యక్తమైన నేపథ్యంలో అనూహ్యంగా సోమవారం ఉదయం ఫలితాలు వెలువరించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.