KCR: సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య
KCR: సీఎం కేసీఆర్ కి మరో ప్రత్యామ్యాయ హెలికాప్టర్ ను ఏవియేషన్ సంస్థ వారు ఏర్పాటుచేయనున్నారు
KCR: నేటి ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ దేవకద్ర పర్యటనకు బయలుదేరారు. హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. దీంతో మార్గం మధ్యం నుంచి తిరిగి ఫామ్ హౌస్ హెలికాప్టర్ ను మళ్లించారు. సురక్షితంగా హెలికాప్టర్ ను లాండింగ్ చేశారు. సీఎం కేసీఆర్ కి మరో ప్రత్యామ్యాయ హెలికాప్టర్ ను ఏవియేషన్ సంస్థ వారు ఏర్పాటుచేయనున్నారు. మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ దేవకద్ర పర్యటనకు వెళ్లనున్నారు.