Damodar Raja Narasimha: టాస్క్‌ఫోర్స్ కమిటీలు అప్రమత్తంగా ఉండాలి

Damodar Raja Narasimha: ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నిత్య తనిఖీలు చేపట్టాలి

Update: 2024-09-21 16:15 GMT

Damodar Raja Narasimha: టాస్క్‌ఫోర్స్ కమిటీలు అప్రమత్తంగా ఉండాలి

Damodar Raja Narasimha: ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సూచించారు. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో నిత్యం తనిఖీలు జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తనిఖీల వివరాలను ప్రతి నెలా తనకు నివేదిక రూపంలో అందించాలని సూచించారు. ఫుడ్ సెక్యూరిటీ అధికారులు ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలోని డైట్ క్యాంటీన్లను తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు.

ఆరోగ్యశాఖలోని అన్ని విభాగాల HODలు నెలకు కనీసం 2 సార్లు జిల్లాల్లోని హాస్పిటల్స్‌ను విజిట్ చేయాలని మంత్రి సూచించారు. హాస్పిటల్ అటెండెన్స్‌, ఎక్విప్‌మెంట్, మెడిసిన్, సానిటేషన్, డైట్ ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. అన్ని హాస్పిటళ్లలో అవసరమైన మెడిసిన్‌ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ మేరకు మంత్రి సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్‌‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు.

Tags:    

Similar News