Congress: కాంగ్రెస్‌లో ఖమ్మం సీటుపై సస్పెన్స్..
Congress: ఖమ్మం ఎంపీ సీటు కోసం భట్టి, పొంగులేటి పట్టు
Congress: బెంగళూరుకు ఖమ్మం పాలిటిక్స్ చేరుకున్నాయి. ఖమ్మం స్థానం విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఖమ్మం ఎంపీ సీటు కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పట్టుబడుతున్నారు. భార్య నందినికి ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని భట్టి పట్టు పడుతుండగా.. సోదరుడు ప్రసాద్‌రెడ్డికి సీటు ఇవ్వాలని పొంగులేటి డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం టికెట్ పంచాయితీపై మల్లికార్జున ఖర్గేను కలవడం కోసం బెంగళూరుకు వెళ్లారు భట్టి విక్రమార్క.