Survey on Farmer Loan Waiver: రుణమాఫీ కాని రైతులకు శుభవార్త.. మంగళవారం నుంచి సర్వే
Survey on Farmer Loan Waiver:తెలంగాణలో రైతులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. రుణమాపీ కాని రైతులు తమ వివరాలను నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ మంగళవారం నుంచి సర్వే చేపట్టనుంది. అర్హులు అయి రుణం మాఫీ కాని రైతుల ఇళ్లకు వెళి వివరాలను సేకరించనున్నారు. దీనికోసం రైతభరోసా పంట రుణమాఫీ యాప్ ను ప్రత్యేకంగా రూపొందించారు. ఇక రూ. 2లక్షల దాటి రుణం వారి నుంచి అదనపు మొత్తాలను వసూలు చేసేందుకు బ్యాంకులకు వ్యవసాయశాఖ పర్మిషన్ ఇచ్చింది.
Survey on Farmer Loan Waiver: రుణమాఫీకాని రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. అర్హలై ఉండి ఇతర కారణాల వల్ల రుణమాఫీ కానీ రైతుల ఇళ్లకు వెళ్లి వివరాలు తీసుకోనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ పొందించింది. ఈ యాప్ ను ఆదివారం అన్ని జిల్లాల వ్యవసాయాధికారులు, డివిజన్, మండల అధికారులు, విస్తరణాధికారులకు పంపించారు. రుణమాఫి వర్తించని వారి ఇంటికి వెళ్లి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకుని యాప్ లో స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకం తీసుకోవాలని సూచించింది.
ఈ యాప్ ను ప్రయోగాత్మకంగా కొందరి రైతుల వివరాలను నమోదు చేసి పరీక్షించాలని అధికారులను ఆదేశించింది. మంగళవారం నుంచి సర్వే ద్వారా యాప్ లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. రూ. 2లక్షల వరకు రుణమాఫీ చేసినా తమకు మాపీ కాలేదని రైతులు వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి అకౌంట్లను చెక్ చేసినప్పుడు రేషన్ కార్డు లేదని, చాలా మందికి కుటుంబ నిర్ధారణ కావాల్సి ఉందనే కారణాలు తెలిసాయి. రుణమాఫీ వర్తించని వారి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యాప్ ను రూపొందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఇక వ్యవసాయాధికారులు ముందుగా రుణఖాతాలు, ఆధార్ కార్డులను చెక్ చేస్తారు. తర్వాత కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకుంటారు. ఈ వివరాలను యాప్ లో అప్ లోడ్ చేస్తారు. రుణాలున్న భార్యాభర్తలే కాకుండా 18ఏండ్లు నిండిన వారి కుటుంబ సభ్యుల ఫొటోలు తీసుకుంారు. ఆ తర్వాత కుటుంబ యజమానితో ధ్రువీకరణపత్రం తీసుకుంటారు. లోన్ కు సంబంధించిన ఖాతా, బ్యాంకు బ్రాంచి వివరాలతోపాటు రుణమాఫీ కోసం కుటుంబ సభ్యుల వివరాలను ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్నట్లు పేర్కొంటూ సంతకంతోపాటు మొబైల్ నెంబర్ రాసి ఇవ్వాలి. వీటిని గ్రామ కార్యదర్శి సంతకం చేయాలని వ్యవసాయశాఖ తెలిపింది.