Viveka Murder Case: ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్.. తెలంగాణ హైకోర్టుకు బదిలీ
* బెయిల్ రద్దు అంశం తెలంగాణ హైకోర్టుకు బదిలీ
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు అంశాన్ని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. డిఫాల్ట్ బెయిల్ రద్దుపై తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. వివేకా హత్య కేసులో గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ విజ్ఞప్తిని మెరిట్‌తో పరిశీలించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది సుప్రీంకోర్టు.