Supreme Court: హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Supreme Court: పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఈ ఏడాదికే మినహాయింపులు ఇస్తున్నట్లు ప్రకటన

Update: 2021-09-16 08:09 GMT

హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Supreme Court: హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాలు చేయాలా వద్దా అనే దానిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే నిమజ్జనాలకు ఈ ఏడాది మాత్రమే అనుమతి ఇస్తూ తీర్పు ఇచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయకూడదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం నిమజ్జనానికి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఇది కొత్తగా వస్తున్న సమస్య కాదని, చాలా ఏళ్లుగా ఉందన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరు సంతృప్తికరంగా లేదని, ఇదే చివరి అవకాశమని చెప్పారు. కోట్లాది రూపాయలు సుందరీకరణ కోసం ఖర్చు చేస్తున్నారని, ఇలాంటి కార్యక్రామలకు అవకాశం కల్పించడం వల్ల ఆ నిధులు వృథా అవుతున్నాయని అన్నారు.

Full View


Tags:    

Similar News