Lockdown: నిజామాబాద్‌ జిల్లాలో పకడ్బందీగా లాక్‌డౌన్‌

Lockdown: కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు శ్రమిస్తున్న అధికారులు * అవసరం లేకుండా రోడ్లపైకి వస్తే వాహనం జప్తు

Update: 2021-05-24 11:42 GMT

నిజామాబాద్లో కొనసాగుతున్న లాక్ డౌన్(ఫైల్ ఇమేజ్)

Lockdown: కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ను పోలీసులు జిల్లాల్లో మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ వేళల్లో విచ్చలవిడిగా రహదారులపైకి వచ్చే వాహనదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. సీఎం ఆదేశాలు.. పోలీస్ బాస్ హుకూంతో ఇందూరులో అధికారులు రోడ్డెక్కారు.

నిజామాబాద్ జిల్లాలో కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు యంత్రాంగం కృషి చేస్తోంది. జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దులు ఉండడం, అక్కడి నుంచి రాకపోకలు ఎక్కువగా ఉండడంతో కరోనా వ్యాప్తి అధికమవుతోంది. దీంతో లాక్‌డౌన్‌ సమయంలో మహారాష్ట్ర నుంచి రాకపోకలు నిలిపి వేశారు. వాహన తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు.

రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. మొన్నటి వరకు పట్టణంలో అత్యధిక కేసులు నమోదు కాగా.. ఇప్పుడు పల్లెలకు సైతం వైరస్ విస్తరించింది. దాదాపు అన్ని గ్రామాలలో కేసులు భారీగా నమోదయ్యాయి. సెకండ్‌ వేవ్‌లో వందలాది మంది కొవిడ్‌ బారినపడ్డారు. జిల్లాలో 90శాతం మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుండగా. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్స్‌ ఏర్పాటు చేసినా చాలడం లేదు. దీంతో బాధితులు జిల్లాతో పాటు హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు.

క‌రోనా కట్టడికి లాక్‌డౌన్ ఒక్కటే మార్గమ‌ని భావిస్తుండటంతో ప్రజలు కరోనా కట్టడికి సహాకరించాలని కోరుతున్నారు. ఇక మరోసారి లాక్‌డౌన్‌ పొడిగించకుడా ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. 

Full View


Tags:    

Similar News