బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు శ సూదిని సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం శోధ సంస్థకు ఇచ్చిన అమృత్ పథకం టెండర్లలో అవినీతి జరిగిందని చేసిన ఆరోపణలపై నోటీసులు ఇచ్చినట్లు సృజన్ రెడ్డి తెలిపారు. అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో దాదాపు 15 వందల కోట్ల టెండర్లు సీఎం సొంత బావమరిది సృజన్ రెడ్డికి చెందిన ఈ కంపెనీకి అర్హత లేకున్నా కట్టెబట్టారని కేటీఆర్ ఆరోపించారు.ఇందుకు సంబంధించి సోషల్ మీడియా వెబ్ సైట్ నుండి కంటెంట్ తొలగించాలని.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ కు ఇచ్చిన నోటీసుల్లో కోరారు. అంతేకాదు బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు.