మాతాశిశు భవనాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

జనరల్ ఆస్పత్రిలో నూతన మాతాశిశు సేవల భవనాన్ని సోమవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

Update: 2020-02-10 13:01 GMT

మహబూబ్ నగర్: జనరల్ ఆస్పత్రిలో నూతన మాతాశిశు సేవల భవనాన్ని సోమవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోనే మొట్టమొదటి మెడికల్ కళశాలను మహబూబ్ నగర్ కు తీసుకురావడానికి ఎంతగానో శ్రమించామని అన్నారు. ప్రస్తుతం ఉన్న కలెక్టర్ భవనం హెరిటేజ్ బిల్డింగ్ కాబట్టి అందులో యథావిథిగా ఆస్పత్రి సేవాల్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

దీనివల్ల ఎంతోమందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఒకప్పుడు నెలకు 100 ప్రసవాలు కూడా జరిగేవి కావని... ఇప్పుడు ప్రసవాల శాతం గణనీయంగా పెరిగిందన్నారు. మహబూబ్ నగర్ మెడికల్ కళాశాల రాష్ట్రంలోనే మూడో స్థానంలో ఉండటం సంతోషకరమన్నారు. జనరల్ ఆస్పత్రిని కార్పొరేట్ ఆస్పత్రికి ధీటుగా తీర్చిదిద్దుతామని... ఆస్పత్రిలో జరిగే చిన్న చిన్న అపశ్రుతుల్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి ప్రతిష్టను దెబ్బ తీయొద్దని సూచించారు.


Tags:    

Similar News