Smita Sabharwal: ఆ వార్తలన్నీ అవాస్తవం.. నా రాష్ట్ర ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నాను..
Smita Sabharwal: కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్‌పై వెళ్తున్నారంటూ వస్తున్న వార్తలను సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ ఖండించారు.
Smita Sabharwal: కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్‌పై వెళ్తున్నారంటూ వస్తున్న వార్తలను సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ ఖండించారు. ఆ వార్తలు అవాస్తవమని ట్విటర్ (ఎక్స్) వేదికగా ఆమె వెల్లడించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్మితా సభర్వాల్ సీఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తెలంగాణ సీఎంఓ ప్రత్యేక కార్యదర్శిగా ఉంటూ నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణలో ప్రభుత్వం మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో స్మితా సభర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తారనే ప్రచారం కూడ సాగింది.
‘నేను సెంట్రల్ డిప్యుటేషన్‌కి వెళ్తున్నానని కొన్ని వార్తా ఛానెల్‌లు ఫేక్ న్యూస్ రిపోర్ట్ చేయడం చూశా. ఆ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం మరియు నిరాధారమైనవి. నేను తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిగానే విధులను నిర్వహిస్తా. తెలంగాణ ప్రభుత్వం నాకు ఏ బాధ్యత ఇచ్చినా చేస్తా. నా రాష్ట్ర ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నాను’ అని ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ ఎక్స్‌లో పేర్కొన్నారు.