Konatham Dileep: పోలీసుల అదుపులో కొణతం దిలీప్
Konatham Dileep: బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జీ కొణతం దిలీప్ ను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Konatham Dileep: బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జీ కొణతం దిలీప్ ను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ గా ఆయన పనిచేశారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 5న కూడా ఆయనను హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించి విడిచిపెట్టారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారని అభియోగాలు రావడంతో ఆయనను అప్పట్లో విచారించారు.
కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నించినందుకే అరెస్ట్: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే దిలీప్ ను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా? అని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తాము ఎదుర్కొంటామని ఆయన చెప్పారు.