Ponguleti Srinivas Reddy వరంగల్‌ అభివృద్ధి ప్రణాళికలు వివరించిన మంత్రి పొంగులేటి

Ponguleti Srinivas Reddy: హైదరాబాద్ (Hyderabad) తరహాలో వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు.

Update: 2024-11-19 13:18 GMT
Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy

  • whatsapp icon

Minister Ponguleti Srinivas Reddy: హైదరాబాద్ (Hyderabad) తరహాలో వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. వరంగల్ (Warangal) అభివృద్ధి కోసం అద్భుతమైన మాస్టర్ ప్లాన్ రూపొందించామని, ఈ నగరం చుట్టు మూడు విడతల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కాకతీయ యూనివర్సిటీ నుంచి కాజీపేట, తిమ్మాపూర్, ఎనుమామూల పైడిపల్లి కలుపుతూ నిర్మితమవుతుందన్నారు. భద్రకాళి ఆలయానికి రూ.30 కోట్లు మంజూరు చేసి ఆలయాన్ని, ఆలయ పరిసర ప్రాంతాలను అద్బుతంగా తీర్చిదిద్దుతామన్నారు.

Full View

మంగళవారం వరంగల్‌లో నిర్వహించిన ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ఇప్పటి వరకు జిల్లాకు రూ.5,213 కోట్ల నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. ఇందులో రూ.4,170 కోట్లు డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి కోసం విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన మామునూరు ఎయిర్ ఫోర్టు నిర్మాణం త్వరలో పూర్తవుతుందని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అతికొద్ది రోజుల్లోనే నిర్మించుకోబోతున్నామన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌కు రూ.161 కోట్లు కేటాయించడం జరిగిందని మంత్రి పొంగులేటి తెలిపారు.

Tags:    

Similar News