Lagcherla: లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్ బృందం పర్యటన
Lagcherla: లగచర్లలో బాధితులతో జాతీయ ఎస్టీ కమిషన్ బృందం పరామర్శించింది. ఈ బృందానికి హుస్సేన్ నాయక్ పరామర్శించారు.
Lagcherla: లగచర్లలో బాధితులతో జాతీయ ఎస్టీ కమిషన్ బృందం పరామర్శించింది. ఈ బృందానికి హుస్సేన్ నాయక్ పరామర్శించారు. లగచర్లలో ఏం జరిగిందనే విషయాలపై స్థానికులను ఆయన అడిగి తెలుసుకున్నారు. కమిషన్ అధికారులతో పాటు ఐజీ సత్యనారాయణ కూడా ఉన్నారు.
ఈ నెల 11న లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో పాటు ఇతర అధికారులపై ఆందోళనకారులు దాడులకు దిగారు. ఈ ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఇదే కేసులో ఏ1 నిందితుడిగా బి.సురేష్ ఇంకా పరారీలోనే ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికి 22 మందికిపైగా అరెస్టయ్యారు. ఈ విషయమై బీఆర్ఎస్ నాయకులు ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దుద్యాల మండలంలోని నాలుగు గ్రామాల్లోని సుమారు 3 వేల ఎకరాలు అవసరం. అయితే ఇందులో కొంత ప్రైవేట్ భూమిని సేకరించాల్సిన అవసరం ఏర్పడింది. ఇక్కడ ఎక్కువగా గిరిజన రైతులున్నారు. వారికి ఎకరం, రెండు ఎకరాల భూమి మాత్రమే ఉంది.ఈ భూమిని ఇచ్చేందుకు స్థానిక రైతులు నిరాకరిస్తున్నారు. ఫార్మా కంపెనీల కోసం తమ భూములు ఇస్తే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో తమకు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయనేది స్థానికుల వాదన.
ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు
ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ను కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన గిరిజన ప్రజా ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు. లగచర్లలో ఏం జరిగింది... రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించిందనే విషయాలను వివరించారు.