Telangana TET 2024: టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్..ఈ పని వెంటనే పూర్తి చేయండి

Update: 2024-11-18 02:43 GMT

Telangana TET 2024: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కోసం చాలా మంది అప్లయ్ చేశారు. అయితే అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత వారికి కొన్ని సందేహాలు వస్తున్నాయి. మళ్లీ అప్లికేషన్ పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎందుకంటే ముందు పెట్టిన దరఖాస్తులో కొన్ని మార్పులు చేయాల్సి ఉందని అంటున్నారు. ఇలాంటి వాటిని లెక్కలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పెట్టుకున్న దరఖాస్తులో చేసుకోవాలనుకున్న మార్పులు చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. నవంబర్ 22 లోపు మార్పులు చేసుకోవచ్చని తెలిపింది.

టెట్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు తీసుకునే విధానం నవంబర్ 7 నుంచి అమలు చేస్తున్నారు. అప్పటి నుంచి చాలా మంది దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. నవంబర్ 20తో గడువు కూడా ముగుస్తుంది. దాదాపు 1.25లక్షల మందికి పైగా టెట్ 2024 పరీక్ష రాసేందుకు రెడీ అయ్యారు. మరో 50వేలకు పైగా దరఖాస్తులు వచ్చే అంచనా ఉంది. మొత్తంగా 2లక్షల లోపు అభ్యర్థులు టెట్ రాసే అవకాశం ఉంది. దీంతో వారు టీచర్ అయ్యేందుకు అర్హత సాధిస్తారు.

అప్లికేషన్ లో తప్పులు సరిచేసుకోవాలనుకునేవారు ముందుగా అధికారిక పోర్టల్ https://tgtet2024.aptonline.in/tgtet లోకి వెళ్లి..అక్కడ మీకు ఇక్కడ కింది విధంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

ఇందులో రెడ్ సర్కిల్ ఉన్న బాక్స్ ను క్లిక్ చేస్తే అప్లికేషన్ తిరిగి ఓపెన్ అవుతుంది. అందులో ఎడిట్ ఆప్షన్ వాడుకుని సరిచేసుకోవచ్చు. ఆ తర్వాత సబ్‌మిట్ పై క్లిక్ చేస్తే చాలు. అలా క్లిక్ చేసిన తర్వాత కూడా మళ్లీ మర్పులు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఎన్ని మార్పులైనా నవంబర్ 22లోపు చేసుకోవాలి. ఆ తర్వాత మార్పులు చేసేందుకు అస్సలు వీలుండదు. ఈసారి టెట్ రాసేవారి నుంచి ప్రభుత్వం ఒక పేపర్ కు రూ. 750 ఫీజు తీసుకుంటుంది.

అదే రెండు పేపర్లు రాసేవారైతే రూ. 1000 ఫీజు వసూలు చేస్తోంది. మరో విషయం ఏంటంటే 2024 మేలో జరిగిన టెట్ రాసిన వారు మళ్లీ ఇప్పుడు రాయాలనుకుంటే ఫ్రీగా రాసుకోవచ్చు. అయితే దీనికోసం దరఖాస్తు చేసుకోవాలి. టెట్ హాల్ టికెట్లను డిసెంబర్ 26 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 2025 జనవరి 1 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు ఆన్ లైన్ లో జరుగుతాయి. 8 భాషల్లో పరీక్ష ఉంటుంది. రోజు ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు రెండో సెషన్ ఉంటుంది. టెట్ 2024 ఫలితాన్ని 2025 ఫిబ్రవరి 5న ప్రకటిస్తారు.

Tags:    

Similar News