తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట

కేసీఆర్(KCR), హరీష్ రావు కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

Update: 2024-12-24 06:07 GMT

తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట

కేసీఆర్(KCR), హరీష్ రావు కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మేడిగడ్డు బ్యారేజీ కుంగుబాటు (Medigadda Barrage) కుంగుబాటుపై భూపాలపల్లి జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సస్పెండ్ చేసింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ సరిగా లేవని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. భూపాలపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రాజలింగమూర్తికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

భూపాలపల్లి కోర్టుకు విచారణ పరిధి లేదని కేసీఆర్, హరీష్ రావు తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ మేరకు హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను 2025 జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవినీతి జరిగిందని భూపాలపల్లి కోర్టులో రాజలింగం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ ఏడాది జులై 10న కేసీఆర్, హరీష్ రావు(Harish Rao)కు నోటీసులు పంపింది. ఈ కేసును కొట్టివేయాలని కేసీఆర్, హరీష్ రావు డిసెంబర్ 23న తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్(Quash Petition) దాఖలు చేశారు. జిల్లా కోర్టుకు రివిజన్ పిటిషన్ ను స్వీకరించే అధికార పరిధి లేనందున ఈ పిటిషన్ ను కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు. మేజిస్ట్రేట్ కోర్టు తనకు పరిధి లేదని ప్రైవేట్ ఫిర్యాదును కొట్టేసిన తర్వాత రివిజన్ పిటిషన్విచారణకు స్వీకరించి ప్రైవేట్ ఫిర్యాదును తిరిగి తెరిచే అధికారం జిల్లా కోర్టుకు లేదని కేసీఆర్ , హరీష్ రావు తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు విన్పించారు.

Tags:    

Similar News