Notices To Allu Arjun: నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్..ఉదయం 11గంటలకు విచారణ

Update: 2024-12-24 01:13 GMT

Notices To Allu Arjun: పుష్ప మూవీ హీరో అల్లుఅర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు దర్యాప్తు అధికారి చిక్కడపల్లి ఏసీపీ ముందు విచారణకు హాజరుకావాలంటూ ఆదేశించారు. కేసు దర్యాప్తులో భాగంగా విచారించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా ఈనెల 4న సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మరణించగా..ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ సహా మొత్తం 18 మందిపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఈనెల 13వ తేదీన ఉదయం అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించగా..హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు అవ్వడంతో 14వ తేదీన జైలు నుంచి విడుదలయ్యాడు. కేసు దర్యాప్తులో ఉండగానే కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా మూడు రోజుల కింద అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. పోలీసులు తనపై అవాస్తవాలు నమోదు చేశారంటూ అల్లు అర్జున్ ఆరోపించారు.

ఈ తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేదని చెప్పే ప్రయత్నం చేశాడు. కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు అల్లు అర్జున్ కన్ ఫెషన్ స్టేట్ మెంట్ రికార్డు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే మంగళవారం ఉదయం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎదుట హాజరవ్వాలని సోమవారం పోలీసులు నోటీసులు పంపించారు. 

Tags:    

Similar News