Allu Arjun's Chief Bouncer Arrest: మెయిన్ బౌన్సర్ ఆంటోనీ అరెస్ట్... సీన్ రీకన్‌స్ట్రక్షన్?
Allu Arjun chief bouncer Anthony arrested: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆ రోజు అల్లు అర్జున్ వెంట వచ్చిన బౌన్సర్లలో ప్రధాన బౌన్సర్ ఆంటోనిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంటోనీని చిక్కడపల్లి పోలీసులు నిన్ననే అరెస్ట్ చేశారు. సెలబ్రిటీలకు బౌన్సర్లను సరఫరా చేయడం నుండి ఆ బౌన్సర్లకు ఆర్గనైజ్ చేయడం వరకు ఆంటోనీ కీలకంగా వ్యవహరిస్తుంటాడు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఇవాళ ఆంటోనీని పోలీసులు అక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంది. తొక్కిసలాట జరగడానికి ఆంటోని వ్యవహరించిన తీరే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
అల్లు అర్జున్‌కు రక్షణ వలయంగా నిలబడిన బౌన్సర్లు చుట్టూ ఉన్న జనాన్ని తోసేయడం వల్లే ఈ తొక్కిసలాట చోటుచేసుకుందని పోలీసులు చెబుతున్నారు. అందుకే ఆ బౌన్సర్లకు ఆర్గనైజర్ గా వ్యవహరించిన ఆంటోనీని పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.
బౌన్సర్లకు, సెలబ్రిటీలకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
ఇటీవల హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించారన్నసంగతి తెలిసిందే. అసలు అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు రావడానికే అనుమతి లేదన్నారు. దానికితోడు ఆయన బౌన్సర్లకు వెంటపెట్టుకుని వచ్చి తొక్కిసలాటకు కారణమైనట్లు సీపీ అభిప్రాయపడ్డారు. బౌన్సర్లు వేసే వేషాలకు సెలబ్రిటీలే బాధ్యులు అవుతారని సీవీ ఆనంద్ హెచ్చరించారు. అల్లు అర్జున్ కేసులో కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (Hyderabad CP CV Anand about Allu Arjun case) తెలిపారు.