Sandhya theatre stampede case: ముగిసిన అల్లు అర్జున్ విచారణ

Update: 2024-12-24 10:09 GMT

Allu Arjun questioned by Hyderabad police: సంధ్య థియేటర్ కేసులో హీరో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు మూడున్నర గంటల పాటు అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించారు. తన తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీవాసుతో కలిసి మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. ఏసీపీ రమేష్, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఆయన్ను విచారించారు. తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇటీవల విడుదల చేసిన వీడియో ఆధారంగా ఆయన్ను ప్రశ్నించినట్టు సమాచారం.

డిసెంబర్ 4న రాత్రి సంధ్య థియేటర్‌లో పుష్ప2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వెళ్లిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు అనుమతి నిరాకరిచినా ర్యాలీ చేసి ఒకరి మృతికి కారణమయ్యాడనే అభియోగంతో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు.

ఈ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్‌పై ఉన్న అల్లు అర్జున్‌ను.. విచారణకు హాజరుకావాలని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసుల నోటీసులకు స్పందించిన బన్నీ.. ఉదయం 11 గంటలకు పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. 

Full View


Tags:    

Similar News