Khammam Ragging: ఖమ్మంలో ర్యాగింగ్ కలకలం.. స్పందించిన మంత్రి దామోదర రాజనర్సింహ

Update: 2024-11-17 11:45 GMT

Khammam MBBS student ragging incident: ఖమ్మంలో మెడిసిన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థికి గుండు కొట్టించి ర్యాగింగ్ కు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. ర్యాగింగ్ గురించి సమాచారం అందుకోగానే సంబంధిత ఉన్నతాధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి ర్యాగింగ్ కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News