నిన్ను వదలం: రేవంత్ కు కేటీఆర్ వార్నింగ్

KTR: తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో తమకు తెలుసు... మేం రేవంత్ రెడ్డిని వదిలిపెట్టబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.

Update: 2024-11-15 08:31 GMT

నిన్ను వదలం: రేవంత్ కు కేటీఆర్ వార్నింగ్

KTR: తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో తమకు తెలుసు... మేం రేవంత్ రెడ్డిని వదిలిపెట్టబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఈ కేసుకు రాజకీయరంగు పులుముతోందని ఆయన కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. సంగారెడ్డి జిల్లా జైలులో లగచర్ల కేసులో అరెస్టైన వారిని ఆయన పరామర్శించారు.

గతంలో రేవంత్ రెడ్డి ఫార్మా కంపెనీలను విమర్శించిన ఆయన ప్రస్తావిస్తూ ఇప్పుడు ఫార్మా కంపెనీలకు వేల ఎకరాలను ఎలా కట్టబడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. కొడంగల్ కు తిరుపతి రెడ్డి రారాజు అని ఆయన విమర్శలు చేశారు.

అధికారులపై దాడి చేసిన వారిలో కాంగ్రెస్ కు చెందిన వారిని వదిలేశారని కేటీఆర్ ఆరోపించారు. రమేశ్, నర్సింహులు, రాములు నాయక్ లను కేసు నుండి తప్పించారని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ కు చెందిన వారి పేర్లే ఈ కేసులో పెట్టారన్నారు. ఈ దాడిలో బీఆర్ఎస్ వాళ్లే చేశారని చెప్పేందుకే ఇలా చేశారని ఆయన ఆరోపించారు. కులగణనలో పాల్గొన్న వ్యక్తిని కూడా అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. వనపర్తి జిల్లాలో ఐటీఐ చదువుకుంటున్న విద్యార్థి కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారని ఆయన అన్నారు. ఈ కేసులో అరెస్టైన వారికి న్యాయ సహాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News