Phone Tapping Case: విచారణకు హాజరైన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ శనివారం విచారణకు హాజరయ్యారు.

Update: 2024-11-16 07:15 GMT

Phone Tapping Case: విచారణకు హాజరైన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ శనివారం విచారణకు హాజరయ్యారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ కు చెందిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల క్రితం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పోలీసుల విచారణకు హాజరయ్యారు. అదే రోజున మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అయితే తన వ్యక్తిగత పని కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చినట్టు భాస్కర్ రావు చెప్పారు. తనకు పోలీసుల నుంచి నోటీసులు రాలేదని ఆయన చెప్పారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యర్థుల ఫోన్ల ట్యాపింగ్ చేసి రాజకీయ లబ్ది పొందారని అప్పట్లో కాంగ్రెస్ ఆరోపణలు చేసింది.బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యర్థుల ఫోన్ల ట్యాపింగ్ చేసి రాజకీయ లబ్ది పొందారని అప్పట్లో కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ పై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రతీక్ రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావులు అరెస్టయ్యారు. అప్పట్లో ఎస్ఐబీ ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్ రావుపై ఆరోపణలున్నాయి. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయనను ఇండియాకు రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు.

Tags:    

Similar News