Karthika Pournami 2024: తెలుగురాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

Karthika Pournami 2024: కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.

Update: 2024-11-15 03:33 GMT

Karthika Pournami: తెలుగురాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

Karthika Pournami: కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హారులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోను కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది అని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. ' ఈ మాసంలో ఎక్కువగా శివునికి, విష్ణువుకి పూజలు చేస్తారు. ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం అందుకే ఎక్కడ చూసినా గాని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి నదికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే వేలాది మంది భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరిలో కార్తీక దీపాలను వదిలారు...పెద్ద ఎత్తున భక్తులు రావడంతో గోదావరి నది కిక్కిరిసిపోయింది.

కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఆలయాల్లో మహిళలు కార్తీక దీపాలను వెలిగించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలోని ఆలయాలను దీపాలంకరణతో అందంగా ముస్తాబు చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. కొత్తగూడెం పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకల్లో భాగంగా శివాలయాల్లో మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు.. కొత్తగూడెం పట్టణంలోని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాల్లో అభిషేక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం శివపార్వతుల దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా వేకువజాము నుంచే తిరుపతిలోని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతిలోని కపిలేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. మహిళలు పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు.

తిరుమలలో వైభవంగా కార్తీకపౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక నిలయమైన తిరుమలతో పాటు చిత్తూరు జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాలు శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి,. కార్తీక పౌర్ణమిని పురష్కరించుకొని భక్తి శ్రద్దలతో దీపారాధనలు చేస్తున్నారు. 

Tags:    

Similar News