Telangana: రైతన్నలు ఎగిరిగంతేసే వార్త..ఖాతాల్లోకి డబ్బులు జమ..మొబైల్స్‌లో ఇలా చెక్ చేసుకోండి
Telangana: తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
Telangana: తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కల్లాల్లోకి చేరుతున్నాయి. ఎక్కడిక్కడ కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి సర్కార్ సన్న వడ్లకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ఇచ్చేందుకు సిద్దమైంది. దీనిలో భాగంగానే శనివారం రోజు రైతులకు అందాల్సిన బోనస్ డబ్బులు సుమారు కోటిరూపాయల చెక్కులపై పౌరసరఫరాల శాఖ సంతకాలు చేసింది. ఈ డబ్బులు 48గంటల్లో రైతుల అకౌంట్లో జమ కానున్నాయి.
అయితే నవంబర్ 11వ తేదీన శాంపిల్ గా ఓ రైతు ఖాతాలో క్వింటాల్ కు రూ. 500 బోనస్ చొప్పున మొత్తంగా రూ. 30, 000లను జమ చేసింది. ఖాతాలో డబ్బులు జమైనట్లుగా సదరు రైతు మొబైల్ కు మెసేజ్ కూడా వచ్చింది. శనివారం సుమారు కోటి రూపాయలకుపైగా చెక్కులపై సివిల్ సప్లయ్ డిపార్ట్ మెంట్ సంతకం కూడా చేసింది. అయితే ఈ డబ్బులు రైతుల అకౌంట్లోని 48గంటల్లో జమ కానున్నాయి. రైతుల అకౌంట్లోకి జమ అవ్వడంతోనే వారి వారి మొబైల్స్ కు మెసేజ్ లు కూడా వస్తాయి.
అయితే సన్నరకం వడ్లకు క్వింటాల్ కు 500 రూపాయల చొప్పున రైతులకు బోనస్ ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే బోనస్ చెల్లించేందుకు ఓ ప్రాసెస్ ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. సన్నరకాల వడ్ల కొనుగోలు చేశాక..అందుకు సంబంధించిన డేటాను ప్రభుత్వానికి చేరిన తర్వాత..ఒక ప్రాసెస్ ప్రకారం రైతుల అకౌంట్లోకి ఎంత డబ్బు చేరాలనే సమాచారం పూర్తిగా సేకరించేందుకు 4 నుంచి 6 రోజుల సమయం పడుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వం వద్దకు సమాచారం వచ్చిన వెంటనే క్వింటాల్ కు రూ. 500 చొప్పున బోనస్ డబ్బులను విడుదల చేస్తామని ప్రభుత్వం విడుదల చేసిన 48 గంటల్లోనే రైతుల అకౌంట్లోకి ఆ డబ్బులు జమ అవుతాయని మంత్రి ప్రకటించారు. దాని ప్రకారమే ఈ ఖరీఫ్ సీజన్ కు గాను నవంబర్ 16న రైతులకు బోనస్ డబ్బులను ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.