గద్దర్ కూతురు వెన్నెలకు కీలక పదవి

తెలంగాణ సాంస్కృతిక సారధి ఛైర్ పర్సన్ గా గద్దర్ కూతురు గుమ్మడి వెన్నెలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2024-11-16 13:56 GMT

గద్దర్ కూతురు వెన్నెలకు కీలక పదవి

తెలంగాణ సాంస్కృతిక సారధి ఛైర్ పర్సన్ గా గద్దర్ కూతురు గుమ్మడి వెన్నెలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఆమె పోటీ చేసి ఓడిపోయారు. రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.ఈ ఉప ఎన్నికలో వెన్నెలకు కాంగ్రెస్ టిక్కెట్టు ఇవ్వలేదు. బీజేపీ నుంచి పార్టీలో చేరిన శ్రీగణేష్ కు కాంగ్రెస్ టిక్కెట్ కేటాయించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సాంస్కృతిక సారధిని ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. తొలుత దీనికి రసమయి బాలకిషన్ ను ఛైర్మన్ గా నియమించారు. ఆ తర్వాత ఇదే పదవిలో ఆయనను కొనసాగించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడి కాంగ్రెస్ గెలిచింది. దీంతో సాంస్కృతిక సారధిని నియమించాల్సి వచ్చింది. గద్దర్ కూతురును ఈ పదవికి రేవంత్ రెడ్డి సర్కార్ ఎంపిక చేసింది.

Tags:    

Similar News