School Holiday: విద్యార్థులకు గుడ్ న్యూస్..ఈ రోజు స్కూళ్లకు సెలవు..కారణమిదే
School Holiday: ఈ మధ్యకాలంలో పాఠశాలలకు వరుసగా సెలవులు వస్తున్నాయి. ఇప్పుడు మరో హాలుడేను ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. నేడు నవంబర్ 18వ తేదీన కొన్ని పాఠశాలలకు,కాలేజీలకు సెలవు ప్రకటించింది. గ్రూప్ 3 పరీక్ష జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. గ్రూప్ 3 పరీక్షల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 17, 18 తేదీల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. దీనికోసం సెంటర్ల దగ్గర పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ కారణంగానే పరీక్షలు జరుగుతున్న సెంటర్ల స్కూల్స్ కొన్నింటికి సెలవు ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు 1,401 కేంద్రాల్లో గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. 5.36లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. తెలంగాణలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 1388 గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీ కోసం ఈ పరీక్షలు జరుగుతున్నాయి. గ్రూప్ 3 పరీక్షల నిర్వహణ అత్యంత పకడ్బందీగా జరుగుతోంది. అన్ని సెంటర్లకు స్ట్రిక్ట్ రూల్స్ జారీ చేసింది. పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం.
హాల్ టికెట్స్ ఉన్న వారినే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇస్తున్నారు. పరీక్ష రాసే అభ్యర్థి ఫొటో హాల్ టికెట్ పై క్లియర్ గా ఉండాలి. అదే విధంగా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, గవర్నమెంట్ ఎంప్లాయి ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ చూపించాల్సి ఉంటుంది. అభ్యర్థులను ఉదయం 8.30గంటల నుంచి పరీక్షాకేంద్రంలోకి అనుమతించి 9.30గంటలకు గేట్లు మూసేస్తారు. పరీక్ష హాలులోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లేందుకు అనుమతి ఉండదు.