Lagacherla Attack Case: లగచర్ల దాడి కేసులో పోలీసుల ఎదుట ప్రత్యక్షమైన సురేశ్
Lagacherla attack case accused B Suresh: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో అధికారులపై దాడికి పాల్పడిన కేసులో A2 నిందితుడిగా ఉన్న బోగమోని సురేశ్ ఇవాళ పోలీసుల ఎదుట లొంగిపోయారు. సురేశ్ ను పోలీసులు కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. నవంబర్ 11న ఈ ఘటన జరిగింది. అప్పటి నుండే సురేశ్ అదృశ్యమయ్యారు. దాంతో పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి ఇప్పటికే ఈ కేసులో అరెస్టయి జైల్లో ఉన్నారు. నరేందర్ రెడ్డి ప్రోద్బలంతోనే సురేశ్ ఈ దాడికి కుట్ర చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.