Minister Seethakka: మహిళలపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చర్యలు

Update: 2024-11-19 13:31 GMT

Minister Seethakka speech in Warangal congress meeting: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ప్రభుత్వమని, మహిళా అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వమని మంత్రి సీతక్క అన్నారు. అందుకే మహాలక్ష్మి పథకాన్ని ఆరు గ్యారంటీల్లో ప్రకటించిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తెచ్చామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్న సందర్భంగా వరంగల్‌లో ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ తొలి సభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళలపై ఆర్థిక భారం పడకూడదని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఇందులో భాగంగానే గ్యాస్ సిలిండర్‌పై రాయితీ ఇచ్చి భారం తగ్గించామని పేర్కొన్నారు. అంతేకాకుండా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని వెల్లడించారు.

Full View

ఏ దేశంలోనైతే మహిళ ప్రగతి పథంలో ఉంటారో ఆ సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి సీతక్క. మహిళలను లక్షాధికారులను చేయాలనే ఉద్దేశంతో నాడు వైఎస్ఆర్ పావలా వడ్డీని తీసుకొస్తే.. నేడు మహిళలందరికీ బ్యాంక్ లింకేజీలతో పాటు ఎలాంటి వడ్డీ వారిపై పడకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం భరిస్తోందన్నారు. మహిళల కోసం ఉచిత బస్సు పెడితే.. దానిపై కూడా విపక్షాలు దుష్ప్రచారం చేశాయని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News