Lagacharla incident: పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డి బదిలీ

లగచర్ల దాడి ఘటనలో పరిగి డిఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. కరుణసాగర్ రెడ్డి స్థానంలో శ్రీనివాస్ ను ప్రభుత్వం నియమించింది.

Update: 2024-11-18 13:24 GMT

Lagacharla incident: పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డి బదిలీ

Lagacharla incident:లగచర్ల దాడి ఘటనలో పరిగి డిఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ కార్యాలయానికి సోమవారం అటాచ్ చేశారు. కరుణసాగర్ రెడ్డి స్థానంలో శ్రీనివాస్ ను ప్రభుత్వం నియమించింది. ఇవాళ లగచర్లకు జాతీయ ఎస్టీ కమిషన్ ప్రతినిధులు పర్యటించారు.

ఈ సమయంలో లగచర్ల బాధితులు పరిగి డిఎస్పీ కరుణసాగర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అమాయకుల పేర్లను ఇరికించారని డీఎస్పీపై గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే ఆయనను తప్పించింది ప్రభుత్వం.ఈ ఏడాది జూలై 10న కరుణసాగర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ డీపీఓలో పనిచేస్తున్న ఆయనను పరిగికి బదిలీ చేశారు. పరిగిలో పనిచేసిన జి.శ్రీనివాస్ ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు.

ఈ ఏడాది జూలై 10న కరుణసాగర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ డీపీఓలో పనిచేస్తున్న ఆయనను పరిగికి బదిలీ చేశారు. పరిగిలో పనిచేసిన జి.శ్రీనివాస్ ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. ఈ నెల 11న లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు.ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న బి.సురేష్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఇదే కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News