Lagacherla Attack Case: పట్నం నరేందర్ రెడ్డికి జైల్లో 'స్పెషల్ బ్యారక్, ఇంటి భోజనం'

Update: 2024-11-19 16:45 GMT

Lagacherla Attack Case: లగచర్లలో అధికారులపై దాడి కేసులో మంగళవారం పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో అరెస్టయి చర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాల్సిందిగా హై కోర్టు ఆదేశించింది. అలాగే ఆయనకు ఇంటి నుండి భోజనం అనుమతించాల్సిందిగా కోర్టు స్పష్టంచేసింది. చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌కు కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. తోటీ ఖైదీలతో కాకుండా తనకు ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని పట్నం నరేందర్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తనకు ఇంటి నుండి భోజనం అనుమతించాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. పట్నం పిటిషన్ పై విచారణ చేపట్టిన అనంతరం కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది.

Full View

మరోవైపు ఇదే కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బోగమోని సురేశ్ ఇవాళ కొడంగల్‌లో కోర్టు ఎదుట లొంగిపోయారు. నవంబర్ 11న లగచర్లలో దాడి జరిగినప్పటి నుండి సురేశ్ పరారీలో ఉన్నారు. పట్నం నరేందర్ రెడ్డి సూచనలతోనే సురేశ్ ఈ దాడికి కుట్ర పన్నినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఆయన ఫోన్ లో సురేశ్ తో 42 సార్లు మాట్లాడినట్లుగా కాల్ డేటా ఉందని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పట్నం పాత్ర ఉందనడానికి అదే ఆధారం అని పోలీసులు చెబుతున్నారు.

Tags:    

Similar News