Hyderabad Power cut: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్..నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

Hyderabad Power Cuts Today: హైదరాబాద్ (Hyderabad) వాసులు నేడు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కరెంటు లేని అసౌకర్యాన్ని ఎదుర్కుంటారు.

Update: 2024-11-19 04:36 GMT

Hyderabad Power Cuts Today: హైదరాబాద్ (Hyderabad) వాసులు నేడు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కరెంటు లేని అసౌకర్యాన్ని ఎదుర్కుంటారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొన్ని ప్రాంతాల్లో పవర్ ఉండదు. అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యానికి ఆటంకం కలుగుతుంది.

బంజారాహిల్స్ లోని కొన్ని ప్రాంతాల్లో కరెంట్ ఉండదు. అక్కడ నేడు రిపేర్లు చేస్తున్నారు. పనికిరాని వైర్లను తీసేసి, మంచి వైర్లను ఉంచుతారని అధికారులు తెలిపారు. అలాగే అవసరమైన చోట పాత వైర్లను తొలగించి కొత్త వైర్లను వేస్తాను. ఇలా చాలా రకాల పనులు ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ ఉండదు.

ఎల్వీ ప్రసాద్ మార్క్ ఫీడర్ల పరిధిలోని అశ్వినిలేఔట్, ఎన్ఎండీసీ, హుడా ఎంక్లేవ్, హనుమాన్ టెంపుల్, డీకేనగర్, 11కేవీ ఉడ్స్ అపార్ట్ మెంట్, పార్క్ హయత్ వెనక ప్రాంతాల్లో కరెంటు ఉండదు.

నందిహిల్స్, హుడా ఎంక్లేవ్, బీఎన్ఆర్ హిల్స్, సైలెంట్ వ్యాలీ పార్క్, ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర, 11కేవీ బీఎన్ఆర్ హిల్స్ , రోడ్ నెంబర్ 14 ఫీడర్లలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 51, 70 హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోతుంది.

Tags:    

Similar News