Dil Raju press meet: సీఎం రేవంత్ రెడ్డితో సమావేశంలో చర్చకొచ్చిన అంశాలివే
Dil Raju press meet after meeting CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. ఈ భేటీ అనంతరం తెలుగు ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రితో సమావేశంలో చర్చించిన అంశాలను, సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచనలను మీడియాకు వివరించారు. తెలుగు సినీ పరిశ్రమ గౌరవం పెరిగేలా పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం సూచించినట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలోని అన్ని సినీ పరిశ్రమలు షూటింగ్స్ కోసం హైదరాబాద్ వస్తున్నాయి. అలాగే ఇంటర్నేషనల్ సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్స్ జురుపుకునేలా ఉండేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్నారు.
డ్రగ్స్‌పై ప్రభుత్వం చేస్తోన్న పోరాటంలో సినీ పరిశ్రమ సహకారాం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు దిల్ రాజు తెలిపారు. ఇతర సామాజిక సమస్యలపై పోరాటంలో తెలుగు సినీ పరిశ్రమ తమ వంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి చెప్పినట్లు (CM Revanth Reddy instructions to Telugu Film Industry) వెల్లడించారు. తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు.
మరో ప్రముఖ సినీ నిర్మాత సురేశ్ బాబు కూడా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నుండి తెలుగు సినీ పరిశ్రమకు తగిన సహాకారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ విషయంలో ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు (D Suresh Babu).