Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం వెబ్ సైట్.. టోల్ ఫ్రీ నెంబర్.. మీరు అర్హులైతే డైరెక్టుగా ఫిర్యాదు చేయండి..!

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ శర వేగంగా అడుగులు వేస్తోంది. ఈ పథకం వచ్చే నెల నుంచి ప్రారంభంకానుంది.

Update: 2024-12-26 07:11 GMT

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం వెబ్ సైట్.. టోల్ ఫ్రీ నెంబర్.. మీరు అర్హులైతే డైరెక్టుగా ఫిర్యాదు చేయండి..!

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ శర వేగంగా అడుగులు వేస్తోంది. ఈ పథకం వచ్చే నెల నుంచి ప్రారంభంకానుంది. సంక్రాంతి నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్టు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొత్త ఏడాదిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన లబ్దిదారుల ఎంపికతో పాటు నిర్మాణ పనులను కూడా ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే యాప్ ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌లో లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే లబ్దిదారుల ఎంపిక వచ్చే నెల 7వ తేదీ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో లబ్దిదారులు సంక్రాంతికి తమ సొంత ఇంటికి భూమి పూజ చేసుకునేలా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది.

కొత్త ఏడాదిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రత్యేకంగా వెబ్ సైట్‌తో పాటు, టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. ఇందిరమ్మ ఇళ్ల కింద లబ్దిదారులను ఎంపిక చేసేందుకు ఇప్పటికే గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను నియమించారు. తొలి విడతగా సొంత స్థలం ఉన్న వారిని ఈ పథకం కింద ఎంపిక చేస్తారు. ఎంపికైన ఒక్కొక్కిరికి ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఇవ్వనుంది. ఇంటిని ఎంత విస్తీర్ణంలోనైనా నిర్మించుకునే వెసులుబాటును పేదలకు కల్పించింది.

తమ ఆర్థిక స్థోమతకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకోవచ్చని ఇందులో ఎలాంటి షరతులు లేవని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ముందుగా రోజువారీ కూలీలు, గిరిజన ప్రాంతాల్లో ఇళ్లను మంజూరు చేయనుంది. లబ్దిదారుల ఎంపిక పూర్తైన వెంటనే నిధులను విడుదల చేయనుంది. నాలుగేళ్లలో ఇరవై లక్షల ఇళ్లను నిర్మించే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అర్హులైన లబ్దిదారులు ప్రభుత్వం ఏర్పాటు చేసే వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. త్వరలో ఏర్పాటు కానున్న టోల్ ఫ్రీ నెంబరుకు కూడా ఫోన్ చేసి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ఒకవేళ మీరు అర్హులై ఉండి ఇళ్లు రాకపోతే టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. 

Tags:    

Similar News