Errolla Srinivas: బీఆర్‌ఎస్‌ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అరెస్ట్‌..

Errolla Srinivas: బీఆర్ఎస్‌ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను మాసబ్‌ట్యాంక్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-12-26 05:55 GMT

Errolla Srinivas: బీఆర్‌ఎస్‌ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అరెస్ట్‌..

Errolla Srinivas: బీఆర్ఎస్‌ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను మాసబ్‌ట్యాంక్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌లో నమోదైన కేసులో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు.

ఈక్రమంలో ఎర్రోళ్ల శ్రీనివాస్‌(Errolla Srinivas) తలుపులు తెరవలేదు. విషయం తెలుసుకొని బీఆర్ఎస్‌ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విధుల అడ్డగింతపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి(Padi Kaushik Reddy), ఎర్రోళ్ల శ్రీనివాస్‌ సహా మరికొంత మందిపై గతంలో కేసు నమోదైంది. ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను మాసబ్ ట్యాంక్ స్టేషన్‌కు తరలించారు.


Tags:    

Similar News