Telangana New Scheme Landless Farmers: భూమిలేని రైతు కూలీల ఖాతాల్లోకి త్వరలో రూ. 12,000... దీనికి అర్ఙులు ఎవరంటే?

Update: 2024-12-26 02:39 GMT

New Scheme: తెలంగాణలో భూమిలేని వ్యవసాయ కూలీలకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. వారికి ఏటా రూ. 12వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. ఈ స్కీము ప్రకారం రెండు విడతల్లో సాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 28వ తేదీన మొదటి విడతలో రూ. 6వేలు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు ఈ స్కీముకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఈనెల 28వ తేదీన నిధులు విడుదల చేస్తారా లేదా అనేదానిపై ప్రజల్లో సందేహం నెలకొంది. ఈ స్కీము ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులను ప్రాతిపదికగా తీసుకుని లబ్దిదారులకు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలోని భూమిలేని వ్యవసాయ కూలీల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్కీమును ప్రభుత్వం రూ. 1200కోట్లు కేటాయించింది. లబ్దిదారుల ఎంపిక కోసం ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డుల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు ఈ ప్రక్రియను చేపడుతున్నారు. తొలివిడతలో ఉపాధి హామీ కింద 100రోజుల పని పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వున్నట్లు సమాచారం. దశలవారీగా సాయం అందించనున్నట్లు తెలుస్తోంది.

ఈ స్కీము మార్గదర్శకాలు ఇంకా అధికారికంగా విడుదల అవ్వకపోవడంతో రైతు సంఘాలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వంద రోజుల పనిపూర్తి చేయని వారు ఎలా అర్హులు అవుతారని ప్రశ్నిస్తున్నారు. చిన్న రైతులు, ఒంటరి మహిళలకు ఈ పథకంలో అవకాశం కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కాగా ఈనెల 30వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో ఈ స్కీము అమలు మార్గదర్శకాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమావేశంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు పథకాలపై కూడా చర్చించనున్నారు. కొత్త రేషన్ కార్డుల అమలుపైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలోని 15లక్షల మంది వ్యవసాయ కూలీలకు ఆర్థిక భరోసా కల్పించడం ఈ స్కీము ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. మొదటి విడతలో డిసెంబర్ 28న రూ. 6వేల చొప్పున నగదు జమ చేయనున్నారు. ఈ స్కీము కింద ప్రభుత్వం ఉద్దేశాలు కార్యరూపం దాల్చడం రైతు కూలీలకు ఆర్థికంగా తోడ్పాటును అందించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అభివ్రుద్ధి చేకూరుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News