Kaushik Reddy: కౌశిక్ రెడ్డికి బంజారాహిల్స్ పోలీసుల నోటీసులు
కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)కి బంజారాహిల్స్ పోలీసులు బుధవారం నోటీసులు పంపారు.
కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)కి మాసబ్ ట్యాంక్ (Masab Tank Police) పోలీసులు బుధవారం నోటీసులు పంపారు. డిసెంబర్ 27న విచారణకు రావాలని ఆ నోటీసులో తెలిపారు. బంజారాహిల్స్ (Banjarahills ) సీఐ (Raghavendra)విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో విచారణకు రావాలని ఆయనను కోరారు. బంజారాహిల్స్ సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాలని ఆయనను పోలీసులు కోరారు.
డిసెంబర్ 4న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కౌశిక్ రెడ్డితో పాటు 20 మంది ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ సమయంలో బంజారాహిల్స్ సీఐ బయటకు వెళ్తున్నారు. తన ఫిర్యాదును స్వీకరించిన తర్వాతే బయటకు వెళ్లాలని సీఐను కౌశిక్ రెడ్డి కోరారు.
అత్యవసర పని నిమిత్తం వెళ్లాలని సీఐ చెప్పారు. తిరిగి వచ్చిన తర్వాత ఫిర్యాదును స్వీకరిస్తానని సీఐ చెప్పడంతో కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ వాహనాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. సీఐతో బీఆర్ఎస్ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. ఈ పరిణామాలతో సీఐ కౌశిక్ రెడ్డి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు.
ఈ కేసులో డిసెంబర్ 5న ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని బెయిల్ మంజూరు చేసిన సమయంలో కోర్టు ఆదేశించింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏం జరిగిందనే దానిపై పోలీసులు కౌశిక్ రెడ్డిని విచారించే అవకాశం ఉంది.