Indiramma Houses: పేదప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై సర్కార్ కీలక ప్రకటన..!

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది.

Update: 2024-12-25 06:56 GMT

Indiramma Houses: పేదప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై సర్కార్ కీలక ప్రకటన

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది. కొత్త సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

తెలంగాణలో కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పాలన ద్వారా ఆరు గ్యారంటీలకు దరఖాస్తులను స్వీకరించగా.. వాటిలో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ, ఆరోగ్య శ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం వంటి పథకాలు ప్రారంభించారు.

ఇక అధికారికంగా ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Houses) పథకం ప్రారంభమైనా విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. దీనిపై సమీక్షించిన మంత్రి.. ఇప్పటి వరకు 32 లక్షల కుటుంబాల సర్వే పూర్తి చేసి మొబైల్ యాప్ లో నమోదు చేసినట్టు చెప్పారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు ప్రత్యేకంగా వెబ్ సైట్, టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. దీని కోసం జిల్లా స్థాయిలో ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక డైరెక్టర్లను నియమించినట్టు తెలిపారు.

జనవరి మొదటి వారంలో అంటే జనవరి 7వ తేదీలోపే 80 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుందని.. లబ్దిదారుల ఎంపికపై కసరత్తు జరుగుతోందన్నారు. నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం చేసిన హౌసింగ్ కార్పొరేషన్‌ను తిరిగి బలోపేతం చేసినట్టు చెప్పారు.

Tags:    

Similar News