Hyderabad: ప్రేమ పేరుతో వేధింపులు..యాసిడ్ తాగి డిగ్రీ చదువుతున్న విద్యార్థి బలవన్మరణం

Update: 2024-12-26 01:25 GMT

Hyderabad: ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్న ఓ యువకుడి నుంచి తప్పించుకునేందుకు ఓ యువతి యాసిడ్ తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం దమ్మాయిగూడలోని భవానీనగర్ లో కూలీ పనులు చేసుకునే పొనుగంట తానీషా, హారికకు కూతురు, కుమారుడు ఉన్నాడు.

కూతురు పూర్ణిమ ఈసీఐఎల్ లో ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. కొన్నిరోజులుగా అదే కాలేజీలో చదువుతున్న నిఖిల్ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. రోజురోజుకు వేధింపులు ఎక్కువవ్వడంతో మనస్తాపానికి గురయ్యింది. మంగళవారం రాత్రి ఇంట్లోనే యాసిడ్ తాగి బలవన్మరణానికి పాల్పడింది.

పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పూర్ణిమ డెడ్ బాడీని పోస్టు మార్టం నిమ్మిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు యువతి డెడ్ బాడీతో పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఏసీపీ మహేశ్ నిందితుడిపై చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు.

Tags:    

Similar News