School Holiday: మాజీప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపంగా నేడు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
School Holiday: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఈ నేపథ్యంలో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజులపాటు సంతాపదినాలు పాటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారి రాత్రి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో దేశం గొప్ప కుమారుడిని కోల్పోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త, మహానాయకుడు, సంస్కరణ వాది అన్నింటికి మించి గొప్ప మానవతావాది అని సీఎం పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని ఆయన నివాసంలో ఉంచారు. ఈరోజు ఆయన భౌతికకాయాన్ని చివరి దర్శనం కోసం ఉంచనున్నారు.