IAS Transfers in Telangana: తెలంగాణలో భారీ సంఖ్యలో ఐఏఎస్‌ల బదిలీలు.. స్మితా సభర్వాల్‌కు వేరే బాధ్యతలు

Update: 2024-11-11 15:35 GMT

IAS Transfers in Telangana: తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీచేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

1) స్మితా సభర్వాల్ ( 2001 బ్యాచ్ )

ప్రస్తుతం తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా ఉన్న స్మితా సభర్వాల్ ను తెలంగాణ అడ్వాన్స్‌మెంట్ టూరిజం అండ్ కల్చర్ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో కొనసాగుతున్న ఎన్ శ్రీధర్ ను అక్కడి నుండి రిలీవ్ చేశారు.

2) ఈ శ్రీధర్ ( 2004 బ్యాచ్ )

ప్రస్తుతం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా ఉన్న ఈ శ్రీధర్ ను బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీగా బదిలీ చేశారు. అక్కడ విధుల్లో ఉన్న బి వెంకటేశంను అక్కడి నుండి రిలీవ్ చేశారు.

3) అనితా రామచంద్రన్ ( 2004 బ్యాచ్ )

పంచాయతీ రాజ్ - గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గా ఉన్న అనితా రామచంద్రన్ ను మహిళ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా ట్రాన్స్ ఫర్ చేశారు. ఆ స్థానంలో ఉన్న డా టి.కే. శ్రీదేవిని అక్కడి నుండి రిలీవ్ చేశారు.

4) కే ఇలంబర్తి ( 2005 బ్యాచ్ )

రవాణ శాఖ కమిషనర్ గా ఉన్న ఇలంబర్తిని జీహెచ్ఎంసీ కమిషనర్ గా బదిలీ చేశారు.

5) కే సురేంద్ర మోహన్ ( 2006 బ్యాచ్ )

గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న సురేంద్ర మోహన్ ను ఇళంబర్తి స్థానంలో రవాణ శాఖ కమిషనర్ గా బదిలీ చేశారు.

6) చెవ్వూరి హరి కిరణ్ ( 2009 బ్యాచ్ )

ఇటీవల జరిగిన బదిలీల తరువాత పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న చెవ్వూరి హరి కిరణ్ ను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా బదిలీ చేశారు.

7) డి కృష్ణ భాస్కర్ ( 2012 బ్యాచ్ )

ప్రస్తుతం డిప్యూటీ సీఎం పేషీలో స్పెషల్ సెక్రటరీగా ఉంటూ ఆర్థిక ప్రణాళి సంఘం స్పెషల్ సెక్రటరిగానూ కొనసాగుతున్న డి కృష్ణ భాస్కర్ ను ట్రాన్స్ కో సీఎండీగా బదిలీ చేశారు. ఆ స్థానంలో ఉన్న సందీప్ కుమార్ సుల్తానియాను అక్కడి నుండి రిలీవ్ చేశారు.

8) శివ శంకర్ లోతేటి ( 2013 బ్యాచ్ )

ప్రస్తుతం పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న శివ శంకర్ లోతేటిని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓగా పోస్టింగ్ ఇచ్చారు.

9) జి సృజన ( 2013 బ్యాచ్ )

పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్న జి సృజనను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. 

10) చిట్టెం లక్ష్మి ( 2013 బ్యాచ్ )

పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్న చిట్టెం లక్ష్మికి ఆయుష్ డైరెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చారు.

11) ఎస్ కృష్ణ ఆదిత్య ( 2014 బ్యాచ్ )

కార్మిక శాఖ డైరెక్టర్ గా ఉన్న కృష్ణ ఆదిత్యను ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా, అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ విభాగం సెక్రటరిగా బదిలీ చేశారు.

12) సంజయ్ కుమార్ ( 1995 బ్యాచ్ )

లేబర్, ఎంప్లాయిస్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సంజయ్ కుమార్ ను కార్మిక శాఖ కమిషనర్ గా బదిలీ చేశారు.

13) గౌరవ్ ఉప్పల్ ( 2005 బ్యాచ్ )

ప్రస్తుతం ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ఉన్న గౌరవ్ ఉప్పల్ ను సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శిగా ట్రాన్స్‌ఫర్ చేశారు.

Tags:    

Similar News