Bandi Sanjay: బీసీని సీఎం చేయాలంటే బీజేపీకి ఓటు వేయాలి
Bandi Sanjay: సిరిసిల్లలో రాణి రుద్రమకు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ
Bandi Sanjay: బీసీని ముఖ్యమంత్రి చేయాలంటే బీజేపీకి ఓటు వేయాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో సుస్థిర పాలన అందిస్తామన్నారు. బీజేపీ బీసీని సీఎం చేస్తానంటే ఓర్వ లేకపోతున్నారని చెప్పారు. సిరిసిల్లలో సైలెంట్‌గా ఓటింగ్ జరుగుతుందని... రాణి రుద్రమ ఎమ్మెల్యే కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ దేవికి మద్దతుగా పెద్దఎత్తున బైక్ ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు.