Peddamma Thalli Temple: జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు షురూ

Peddamma Thalli Temple: ఇబ్బందులు ఏర్పడకుండా ఏర్పాట్లు చేశామని తెలిపిన అధికారులు

Update: 2023-10-15 07:10 GMT

Peddamma Thalli Temple: జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు షురూ

Peddamma Thalli Temple: దేవీ శరన్నవరాత్రి, దసరా ఉత్సవాలకు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి దేవాలయం ముస్తాబయింది. ఆలయంలో నేటి నుంచి శరన్నవరాత్రులు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 15 నుంచి 23 వరకు జరిగే ఉత్సవాల్లో అమ్మ వారు పలు అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాలకు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు ఆలయ ఆధికారులు తెలిపారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు పూర్తి చేశామని, క్యూ లైన్ల ద్వారా భక్తులకు దర్శనం కల్పించనున్నామన్నారు అధికారులు.

నవరాత్రుల్లో నేడు అమ్మ వారు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనం ఇస్తున్నారు.. ఉదయం 3 గంటలకు అమ్మ వారిని నిద్రలేపి అభిషేకాలు జరిపించారు.. అమ్మ వారి దర్శనం కోసం భక్తులు ఉదయం 6 గంటల నుంచి ఆలయానికి తరలి వచ్చారు. ఉదయం 9 గంటలకు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.. అమ్మ వారి దర్శనం కోసం వస్తున్న వేలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News