Self lockdown in Warangal district: స్వచ్చందంగా లాక్ డౌన్.. ఉమ్మడి వరంగల్ జిల్లలో వ్యాపారుల నిర్ణయం!
Self lockdown in Warangal district: కరోనాకు లాక్ లు ఎత్తేశారు. అన్ లాక్ లో వైరస్ పంజా విసురుతోంది. పెరుగుతున్న కేసులు జనాన్ని కంగారుపెడుతున్నాయి.
Self lockdown in Warangal district: కరోనాకు లాక్ లు ఎత్తేశారు. అన్ లాక్ లో వైరస్ పంజా విసురుతోంది. పెరుగుతున్న కేసులు జనాన్ని కంగారుపెడుతున్నాయి. కరోనా కట్టడికి ఎవరో వస్తారని. ఎదో చేస్తారని ఎదురు చూడద్దని ప్రజలే నిర్ణయించుంటున్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం పల్లెలే కాదూ పట్టణాల్లోని ప్రజలందరు ఏకమయ్యారు. కమిటీలు వేసుకుని ఎవరికి వారు షాపులు మూసి వేస్తూ లాక్డౌన్ పాటిస్తున్నారు. కరోనా కలవరపెడుతోంది. వైరస్ వర్రీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పల్లెల నుంచి పట్నాల దాకా ఇదే పరిస్థితి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా విస్తరిస్తోంది. 331 మంది కరోనా భారిన పడ్డట్టుగా వైద్యఆరోగ్య శాఖ అదికారులు చెబుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 128 మంది, వరంగల్ రూరల్ జిల్లాలో 125 మంది, మహబూబాబాద్ జిల్లాలో 21 మంది, జనగామ జిల్లాలో27, ములుగు జిల్లాలో 22, భూపాపలపల్లి జిల్లాలో 12 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా కేసులు పెరుతుండటంతో స్వీయ నియంత్రణ పాటించడం ద్వారానే మనల్ని మనం కాపాడుకోగలుగుతామని ప్రజలు, వ్యాపారులు సెల్ఫ్ లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్‌లోని వస్త్ర దుకాణాలను మూసేవేశారు. నష్టపోతామని తెలిసీనప్పటికి. సెల్ఫ్ లాకడౌన్ పాటిస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు.
వ్యాపారులే కాదు పల్లె ప్రజలే స్వచ్చంధంగా గ్రామాల్లో కమిటీలు వేసుకుని లాక్ డౌన్ లు పాటిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట, పరకాలలో ఉదయం 10 గంటల నుంచిసాయత్రం 5 గంటల వరకే షాపులు తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో ఉదయం 7 గంటల నుండి సాయత్రం 6 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి. వ్యాపారులు స్వచ్ఛందంగా లాకడౌ న్ పాటిస్తున్నారు. వరంగల్ నగర సమీపంలోని అరెపల్లి, పైడిపల్లి, సిద్దాపురం విలీనగ్రామాల్లో చాలామంది కరోనా భారిన పడ్డారు. కరోనా కట్టడి కోసం గ్రామంలో షాపులు ఉదయం 9 నుంచి సాయత్రం 5 గంటల వరకు తీయాలని నిర్ణయించారు.
గ్రామంలోకి ఎవరు వచ్చిన మాస్క్ లు దరించాలని రూల్ పెట్టారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు హోంక్వారంటైన్ లో ఉంచుతామంటున్నారు సెల్ఫ్ లాక్ డౌన్ కమిటీ సభ్యులు. ములుగు జిల్లా కేంద్రంలో కరోనా కేసులు పెరిగి పోతున్నాయి. అందుకే ములుగులో వ్యాపరులందరం కలిసి కమిటీ వేసుకుని సెల్ఫ్ లాక్ డౌన్ పాటిస్తున్నారు. అప్పటి నుంచి కేసులు తగ్గుముఖం పట్టాయని చెపుతున్నారు. మొత్తానికి సెల్ఫ్ లాక్ డౌన్ కరోనాను కట్టడి చేస్తున్నాయి. పక్కాగా నిబంధనల్ని అమలు చేస్తూ వైరస్ వ్యాప్తిని అరికడుతున్న కమిటీల్ని అందరూ అభినందిస్తున్నారు.