Sabitha Indra Reddy: బాసరలో జరుగుతున్న విద్యార్థుల వరుస ఆత్మహత్యలు బాధాకరం
Sabitha Indra Reddy: పూర్తి సమాచారం తెచ్చుకున్న అన్ని విషయాలను వెల్లడిస్తాం
Sabitha Indra Reddy: బాసర ట్రిపుల్ ఐటీలో వరుస సంఘటనలు బాధాకరమన్నారు రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి .వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన రీడింగ్ రూం ను సబితా ప్రారంభించారు. బాసరలో జరుగుతున్న విద్యార్థుల వరుస ఆత్మహత్యలు బాధాకరమన్నారు.మొన్న జరిగిన విద్యార్ధి మృతిపై కమిటీ వేశాం విచారణ కొనసాగుతోందన్నారు. ఈ రోజు జరిగిన ఘటనలో ఇంకా పూర్తి సమాచారం లేదని తెలిపారు. ఏది ఏమైనా విద్యార్థులు సమన్వయం పాటించి ఆత్మహత్యలకు పాల్పడవద్దు సబితా అన్నారు.