Sabitha Indra Reddy: కాంగ్రెస్, బీజేపీలు రైతుల పాలిట శత్రువులు
Sabitha Indra Reddy: గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాం
Sabitha Indra Reddy: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతుల పాలిట శత్రువులని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రైతు బంధు నిధులను ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టించిందని, అయినా ఎన్నికల సంఘం అనుమతినిచ్చిందని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చామని..ప్రస్తుత హామీలు కూడా తప్పకుండా నెరవేరుస్తామని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.